Pushpa 2 North India : నార్త్ ఇండియాలోనూ పుష్ప - 2కలెక్షన్ల సునామీ

Pushpa 2 North India : నార్త్ ఇండియాలోనూ పుష్ప - 2కలెక్షన్ల సునామీ
X

పుష్ప - 2 మూవీ నార్త్ ఇండియాలోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హిందీ మూవీస్ ను తలదన్నుతూ మొదటి రోజు కలెక్షన్లలో రికార్డు నెలకొల్పింది. పుష్ప 2 హిందీ వెర్షన్ ద్వారా 65 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది. షారుఖ్ ఖాన్ 'జవాన్' హిందీ వెర్షన్ మొదటి రోజు 65 కోట్లు వసూలు చేయగా, బన్నీ ఈ రికార్డును చెరిపేసి తన దెబ్బతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్ గా నిలిచింది. పుష్ప 2 తర్వాత జవాన్ 65 కోట్లు, స్ట్రీ 2 55.5 కోట్లు, పఠాన్ 55 కోట్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే యానిమల్, కేజీఎఫ్ 2 కూడా ఈ లిస్టులో ఉన్నాయి. బాహుబలి 2 41 కోట్లు రాబట్టింది. ఇక ఆదిపురుష్, కల్కి 2898, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా నార్త్ లో మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప రూ. 65–67 కోట్లు హిందీ వెర్షన్ సినిమాల్లో మన పుష్పరాజ్ కొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు జవాన్ సినిమాకు తొలి రోజు 65 కోట్లు దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. అయితే నిన్న విడుదలైన పుష్ప - 2 మాత్రం 67 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. స్త్రీ-2 సినిమా 55.5 కోట్లు, పఠాన్ - 55 కోట్లు, యానిమల్ / కేజీఎఫ్ 2 - 52+ కోట్లు బాహుబలి-2 సినిమా 41 కోట్లు ఆదిపురుష్ - 35 కోట్లు కల్కి 2898 ఏడీ - 24 కోట్లు ఆర్ఆర్ఆర్ - 19 కోట్లు

Tags

Next Story