Pushpa 2 OTT : జనవరి 30 నుంచి ఓటీటీలో పుష్ప-2

Pushpa 2 OTT : జనవరి 30 నుంచి ఓటీటీలో పుష్ప-2
X

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప -2 ఓటీటీలో స్టీమింగ్ కు రెడీ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.1896 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన 'పుష్ప2'కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్ ను కూడా ఇదే నిడివితో రానుంది. నెట్ ప్లిక్స్ లో జనవరి 30 నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.

పుష్ప 2 సినిమా ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించింది. హిందీలో రూ.800కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ రికార్డును సృష్టించింది. ఏ బాలీవుడ్ హీరోకు ఇప్పటి వరకు సాధ్యం కాని రూ.700కోట్లు, రూ.800కోట్ల హిందీ నెట్ వసూళ్ల మార్కును అల్లు అర్జున్ సాధించారు. ఈ సినిమా ఇప్పటికే రూ.1,830 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. దీంతో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను దాటేసి.. ఇండియాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. దంగల్ తర్వాత అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా పుష్ప 2 నిలిచింది. మరిన్ని రికార్డులను కూడా సృష్టించింది.

ఓటీటీలోకి పుష్ప-2.. ఎక్స్ ట్రా కంటెంట్‌తో రిలీజ్

ఎప్పుడెప్పుడా అని అల్లు అర్జున్ -సుకుమార్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పుష్ప-2 ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో పుష్ప-2 స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ వెర్షన్ కు కొంత ఎక్స్ ట్రా కంటెంట్ ను యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో... ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story