Pushpa 2 Event : యూసుఫ్ గూడలో పుష్ప 2 ఈవెంట్ జాతర

Pushpa 2 Event :  యూసుఫ్ గూడలో పుష్ప 2 ఈవెంట్ జాతర
X

పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తో యూసుఫ్ గూడ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసరాల్లో సందడి పెరిగింది. ఈ ఈవెంట్ కోసం వేలాదిగా ఫ్యాన్స్ ఇప్పటికే తరలివచ్చారు. యూసుఫ్‌గూడ్ పోలీసు గ్రౌండ్ , చుట్టుపక్కల రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈవెంట్‌కు హాజరయ్యే వీవీఐపీల భద్రత కోసం అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

వెయ్యి మంది పోలీసులతో మొట్టమొదటిసారిగా ఈవెంట్ కు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ ప్రైవేటు బౌన్సర్లు, మరోవైపు పోలీసు బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. దేవర సినిమా ఈవెంట్ లో జరిగిన గొడవతో అప్రమత్తమైన పుష్ప 2 యూనిట్.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పుష్ప గాడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు.

Tags

Next Story