Pushpa 2 : పుష్ప - 2 ప్రీ రిలీజ్ వెన్యూ ఫిక్స్

పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీరిలీజ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్టీయార్ లాంటి మాస్ హీరో సినిమాకి నోవాటెల్ హోటల్ లో ఫంక్షన్ నిర్వహించడం ఎంత పెద్ద తప్పిదమో తెలిసి వచ్చింది. మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బన్నీ' పుష్ప 2 ఈవెంట్ కోసం ఒక పెద్ద స్టేడియం ని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. వెన్యూ కోసం పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. యాసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో 'పుష్ప 2' ఈవెంట్ చేయనున్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ 1న ఈ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా 3 గంటల 22 నిమిషాల రన్ టైం ఉంటుందని సమాచారం. సాధారణంగా సుకుమార్ సినిమాలంటేనే మినిమమ్ 3 గంటల రన్ టైమ్ కామన్. ఈ సినిమాను యూఎస్ రన్ టైమ్ ని 3 గంటల 15 నిమిషాలకు కుదించారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com