Pushpa 2 : పుష్ప-2 ట్రైలర్ ఎప్పుడంటే

Pushpa 2 : పుష్ప-2 ట్రైలర్ ఎప్పుడంటే
X

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన పుష్ప మేనియా నడుస్తోంది. పుష్ప 2 మూవీ ఎప్పు డెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5 కోసం రెడీ అవుతున్నారు. పుష్ప మూవీ హిట్టుతో పుష్ప - 2పై భారీగా అంచనాలు నెల కొన్నాయి. పుష్ప - 2 దెబ్బకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. దాదాపు ఎనిమిది భాషల్లో 11500 స్క్రీన్లలో భారీగా మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ వస్తుందని మూవీ టీమ్ ప్రకటించిన నేపథ్యంలో దాని కోసం ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు. ప్రస్తుతం ట్రైలర్ డబ్బింగ్ వర్క్స్ నడుస్తు న్నాయట. దాదాపు ఆ పని పూర్తైనట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ మధ్యలోనే ట్రైలర్ ఫ్యాన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ట్రైలర్తో పుష్ప - 2అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags

Next Story