Pushpa 3 : మూడేండ్ల తర్వాతే సెట్స్ పైకి పుష్ప-3?

ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించిన సినిమా పుష్ప. సీక్వెన్స్ లో వచ్చిన పుష్ప 2 సినిమాలు రెండు మాస్ ఆడియన్స్ ని బాగా మెప్పించాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బీ టౌన్ మాస్ ఆడియన్స్ కి మంచి మసాలా ఫీస్ట్ అందించాడు బన్నీ. అందుకే పుష్ప 1 సూపర్ హిట్ కాగా పుష్ప 2 దాన్ని మించి సంచలనంగా మారింది. పుష్ప 3 అంటూ సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 3 రాంపేజ్ అంటూ పోస్టర్ తో హైప్ ఎక్కించాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత పుష్ప -3కి పని చేయనున్నాడు బన్నీ.తన నెక్స్ట్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావాలంటే ఎలా లేదన్నా రెండేళ్లు పైన పడుతుంది. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. దాని తర్వాత పుష్ప - 3 గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఏది కాదన్నా... ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా మూడేండ్లు పడుతుంది. ఆ తర్వాతే కూడా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. అంటే పుష్ప - 3 మూవీ 2028 తర్వాతేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లీ సినిమానే దాదాపు 2027 దాకా చేసే చాన్స్ ఉంది. నెక్స్ట్ త్రివిక్రం సినిమా కమిటైతే మాత్రం అదో రెండేళ్లు పైన ఉంటుంది. అంటే ఎలా చూసినా 2028 లో పుష్ప 3 సాధ్యం కాకపోగా సెట్స్ మీదకు వెళ్లడం కూడా కష్టమేనన్న టాక్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com