Pushpa 2 Netflix : నెట్ఫ్లిక్స్ను రూల్ చేస్తున్న పుష్ప రాజ్

Pushpa 2 Netflix :  నెట్ఫ్లిక్స్ను రూల్ చేస్తున్న పుష్ప రాజ్
X

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప -2.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నేషనల్ క్రషర్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నటి శ్రీలీల తన ఎనర్జిటిక్ డ్యాన్సుతో కుర్రకారును ఉర్రూతలూగించింది. కిసిక్ అంటూ ఆమె వేసిన స్టెప్స్ హెలైట్ గా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీ థియేట్రికల్ గా ప్రభంజనమే సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ బయో చేంజ్ చేసింది. దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. అంటే మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ను కూడా పుష్ప రాజే రూల్ చేస్తున్నాడన్నమాట. అంతేకాదు పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10లో కొనసాగుతోంది. ప్రస్తుతం నెటిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. ఇక ఇండియా ట్రెండింగ్లో టాప్1లో పుష్ప 2 సత్తాచాటుతోంది. ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లో ప్రస్తుతం పుష్ప 2 టాప్ ఉంది. మొత్తంగా 21 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 5.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Tags

Next Story