Pushpa 2 Sensation : పుష్ప సంచలనం.. 50 రోజులో రూ. 1230 కోట్లు

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పుష్ప 2: ది రూల్. ఈ సినిమా విడుదలై తాజాగా యాభై రోజులు పూర్తయింది. అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిని షేక్ చేసింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకూ ఈ మూవీ ఇండియాలో రూ.1230.55 కోట్లు వసూలు చేసిన ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. నిన్న కూడా హిందీ బెల్ట్ 8.05శాతం ఆక్యుపెన్సీతో టికెట్లు అమ్ము డుపోగా, రూ.50లక్షల కలెక్షన్ వచ్చింది. 32 రోజుల్లోనే 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన 'పుష్ప 2'కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్లో మరికొన్ని సీన్ను యాడ్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. స్ట్రీమిం గ్ ఎప్పటి నుంచనేది ఆ సంస్థ ప్రకటించాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com