Pushpa : బాహుబలి రికార్డు బ్రేక్ చేయనున్న పుష్ప

Pushpa : బాహుబలి రికార్డు బ్రేక్ చేయనున్న పుష్ప
X

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2'. రష్మిక హీరోయిన్. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ రాకకోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 వేల కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ అదే జరిగితే. బాహుబలిని బ్రేక్ చేయడమే అంటున్నారు సినీ పండితులు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా బాహుబలి మాత్రమే. డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా 9వేల థియేటర్లలో రిలీజైంది. పుష్ప ది రూల్ సినిమాను ఇండియాలోనే 8,500 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిమాండ్ దృష్ట్యా స్క్రీన్లు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు మేకర్స్.

Tags

Next Story