R Narayana Murthy : ప్రపంచమంతా బన్నీ డైలాగే.. ప్రభాస్ రేంజ్ వేరు : ఆర్. నారాయణమూర్తి

కరోనా తర్వాత జనాలు ధియేటర్ లకి వస్తారా రారా అనే భయం చిత్రపరిశ్రమలో బాగానే ఉండేది కానీ మంచి చిత్రాలు వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చూపించాయి 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్‌సింగరాయ్' చిత్రాలు.. ఈ సినిమాలు భారీ వసూళ్ళతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్ , అల్లు అర్జున్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప హీరోలని వారిని కొనియాడారు. శ్యామ్‌సింగరాయ్ సక్సెస్ మీట్‌లో పాల్గోన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా టైం లో కూడా 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్ సింగ రాయ్' తో థియేటర్స్ కళకళలాడాయని అన్నారు. ఇది గర్వించదగిన విషయమని అన్నారు. ఒకప్పుడు తమిళనాడు,ముంబై నుంచి హీరోలు వస్తుంటే ఇక్కడ తెలుగు మీడియా బాగా కవర్ చేసేదని, కానీ ఇప్పుడు మనవాళ్లు ఎక్కడికి వెళ్లిన మీడియా వస్తుందని పేర్కొన్నారు. తెలుగు ఇండస్ట్రీ. తెలుగు రచయితలు, తెలుగు దర్శకుడు, హీరోలు ప్రపంచాన్ని ఏలుతున్నారని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అని అన్నారు.
ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ దుమ్ముదులుపుతున్నాడని, ఇప్పుడు అతని స్థాయి ప్యాన్ ఇండియా వరకు వచ్చిందని అతనికి మనమంతా సపోర్ట్ ఇవ్వాలని అన్నారు. అటు అల్లు అర్జున్ కి క్రేజ్ మరింతగా పెరిగిందని అన్నాడు. ఓసారి కేరళలోని ఓ హోటల్ కి వెళ్తే.. ఇక్కడ టాప్ హీరోలు ఎవరంటే మోహన్ లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్ అని చెప్పాడని చెప్పుకొచ్చాడు.
మలయాళంలో మన తెలుగువాడి సత్తా ఇది అని ఆ రోజు సంతోషించానని అన్నాడు. ఎక్కడికెళ్ళిన ఒకప్పుడు షోలే, భాష సినిమాల్లో అమితాబ్, రజనీకాంత్ డైలాగ్స్ చెప్పుకొనేవారని కానీ పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదే లా' అనే మాటని ప్రపంచం అనుకరిస్తుందని, అది మన తెలుగు హీరోల ఘనత అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com