Raashi Singh : క్లాసిక్ లుక్ లో రాశి సింగ్...ఫోటోలు వైరల్

Raashi Singh : క్లాసిక్ లుక్ లో రాశి సింగ్...ఫోటోలు వైరల్
X

టాలీవుడ్లోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో రాశి సింగ్ ఒకరు. 'జెమ్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అంతకుముందు 14 ఏండ్ల వయసులోనే ఓ కమర్షియల్ యాడ్ లోనూ నటించింది. స్టార్టింగ్ లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ నటన మీద ఉన్న మక్కువతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆది సాయికుమార్ 'శశి' మూవీతో మంచి గుర్తింపు పొందింది. పోస్టర్, ప్రేమ్ కుమార్ వంటి మూవీల్లోనూ అలరించింది. ఈ మధ్యకాలంలో భూతద్దం భాస్కర్ నారాయణలోనూ మెప్పించింది ఈబ్యూటీ. సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్నవదనం 'తో ఇటీవల ఆడియన్స్ ను పలకరించింది రాశి సింగ్. నటనా నైపుణ్యంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది, అయితే ఇంకా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తోంది. సినిమా చాన్సులు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఈభామ. ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్ లతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టుతో క్లాసిక్ లుక్ లో దర్శనిమిచ్చింది. రాశి అందాలకు కుర్రకారు మెస్మరై జ్ అవుతున్నారు. ఈ ప్రస్తు తం పిక్సెనెట్టింట వైరల్ గా మారాయి

Tags

Next Story