Radhakrishna with Gopichand గోపీచంద్ తో రాధాకృష్ణ
ఎంతో ప్రతిభ ఉన్నా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు గోపీచంద్. ఒకప్పుడు విలన్ గా మెప్పించాడు కాబట్టి ఫ్లాపులు వచ్చిన ప్రతిసారీ.. అతన్ని మళ్లీ విలన్ వేషాలు వేసుకోవాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. బట్ అతను పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాకపోతే కథల్లో మార్పులు రావడం లేదు. కేవలం తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంటే చాలు అని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నాడు. అందుకే ఆ మూస నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ప్రస్తుతం తనలాగే వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల దర్శకత్వంలో 'విశ్వం' అనే సినిమా చేస్తున్నాడు. రెండు అక్షరాలు, చివర్లో సున్నా ఉన్న టైటిల్స్ గోపీచంద్ కు హిట్స్ ఇచ్చాయి. అందుకే ఈ మూవీ కూడా హిట్ అవుతుందనుకుంటున్నారు. బట్ సెంటిమెంట్స్ కు హిట్స్ రావు కదా.
ఇక ఈ మూవీ తర్వాత అతను రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ ఫస్ట్ మూవీ గోపీచంద్ తోనే చేశాడు. జిల్ అంటూ వచ్చిన ఆ మూవీ మంచి విజయం సాధించింది. విశేషం ఏంటంటే గోపీచంద్ కు చివరి హిట్ కూడా అదే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే ఫిక్స్ అయిన రాధాకృష్ణ తర్వాత ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేశాడు. రాధేశ్యామ్ అంటూ వచ్చిన ఆ మూవీ పోయింది. దీంతో మరోసారి గోపీచంద్ తోనే ఇదే బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. విశ్వం హిట్ అయితే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com