Radhe Shyam Review: 'రాధే శ్యామ్' మొదటి రివ్యూ.. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం..!

Radhe Shyam Review: మార్చి 11న ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' విడుదల కానుంది. కానీ ఇప్పటినుండే ప్రేక్షకుల దృష్టంతా దానిపైనే ఉంది. అయితే ఇటీవల ఈ సినిమాను సెన్సార్ బోర్డ్ చూసింది. యూతో పాటు ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది రాధే శ్యామ్. ఇప్పటికే ట్రైలర్‌లతో, పాటలతో అంచనాలు పెంచేసిన రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది.
Nobody can beat Class & Style of #Prabhas in India ! He has Sexiest Swag in #RadheShyam ! Totally LOVED & LOVED his performance & wardrobes ❤❤❤
— Umair Sandhu (@UmairSandu) March 4, 2022
ఉమైర్ సంధు ఒక ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు. ఇటీవల ఓవర్సీస్‌లో రాధే శ్యామ్ సెన్సార్ స్ట్రీమింగ్ జరిగింది. సినిమా చూస్తున్నంతసేపు, చూసిన తర్వాత.. రాధే శ్యామ్ గురించి చెప్తూ.. పలు ట్వీట్లు చేశాడు ఉమైర్. అంతే కాకుండా తన సోషల్ మీడియా అన్నింటిలో రాధే శ్యామ్ గురించి పోస్ట్ షేర్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టు అనిపిస్తోంది.
#RadheShyam is truly Cinematic Experience! Climax is the USP of film 🍿❤️🔥
— Umair Sandhu (@UmairSandu) March 5, 2022
'ఇండియాలో ప్రభాస్ స్టైల్‌ను కొట్టేవారే లేరు. చాలా పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. రాధే శ్యామ్ సినిమా చూశారు. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం.' అంటూ వరుస ట్వీట్లలో పేర్కొన్నాడు ఉమైర్. అంతే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్లాస్సీ , స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ, రొమాంటిక్.. రాధే శ్యామ్ అద్భుతం. ప్రభాస్ అదరగొట్టేశాడు' అంటూ ఈ మూవీ పోస్టర్‌ను స్టోరీలో షేర్ చేశాడు.

© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com