Radhe Shyam Release Date: 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్..! మరోసారి 'ఆర్ఆర్ఆర్'తో ఫైట్ తప్పదా..?

Radhe Shyam Release Date: సంక్రాంతి బరిలో దిగాల్సిన ఎన్నో పాన్ ఇండియా సినిమాల్లో 'రాధే శ్యామ్' కూడా ఒకటి. కానీ ఒమిక్రాన్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రారేమో అన్న అనుమానంతో అన్ని పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ రాధే శ్యామ్ మాత్రం అస్సలు తగ్గేదే లే అని థియేటర్లలో సంక్రాంతికి సందడి చేస్తాం అని మాటిచ్చింది మూవీ టీమ్. కానీ చివరిగా అది కూడా వాయిదా పడింది. ప్రస్తుతం రాధే శ్యామ్ కొత్త విడుదల తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతికి పోటీ పడాల్సిన సినిమాలన్నీ ప్రస్తుతం సమ్మర్ రేసువైపు చూస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలన్నీ ఒకేసారి ఫిబ్రవరీలో అయినా విడుదల చేయవచ్చు.. లేకపోతే అది మళ్లీ సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఫిబ్రవరీలో ఎట్టి పరిస్థితుల్లో విడుదలకు సిద్దమయ్యింది 'భీమ్లా నాయక్'. అందుకే ఫిబ్రవరీలో విడుదల చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి పాన్ ఇండియా సినిమాలు సమ్మర్ ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి.
జనవరి 7న విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' కూడా సమ్మర్‌లోనే రెండు తేదీలను బ్లాక్ చేసింది. అయితే మరోసారి రాధే శ్యామ్‌కు, ఆర్ఆర్ఆర్‌కు పోటీ తప్పేలా లేదు. మార్చి 4న రాధే శ్యామ్ విడుదల చేస్తే బాగుంటుందని మూవీ టీమ్ ఆలోచనలో పడిందట. అలా అయితే ఆర్ఆర్ఆర్ విడుదలయిన కొంచెం గ్యాప్‌లోనే రాధే శ్యామ్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ఈ రెండు సినిమాలకు పోటీ తప్పేలా లేదు అనుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com