Radhe Shyam Glimpse: 'ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు?'..

Radhe Shyam Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలాకాలం తర్వాత ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. అదే రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న 'రాధే శ్యామ్'. గత కొన్నేళ్లుగా ప్రభాస్ పూర్తిగా కమర్షియల్ సినిమాలవైపే నడుస్తు్న్నాడు. అవే తనకు సక్సెస్‌ను కూడా తెచ్చిపెట్టాయి. కానీ చాలాకాలం తర్వాత ప్రభాస్ తనలోని లవర్ బాయ్‌ను బయటికి తెచ్చాడు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుండి గ్లింప్స్ విడుదలయ్యింది.
ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే.. ఒక రొమాంటిక్ సినిమా గ్లింప్స్ విడుదల చేయడానికి ఇంతకంటే మంచి టైమ్ ఏముంటుంది అనుకున్నారో ఏమో రాధే శ్యామ్ టీమ్.. నేడు 1.43 నిమిషాలకు కొత్త గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే రాధే శ్యామ్ నుండి ఒక గ్లింప్స్‌తో పాటు ట్రైలర్, పాటలు కూడా విడుదలయ్యాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరీ అని క్లారిటీ వచ్చేసింది ప్రేక్షకులకు. ఇక కొత్తగా రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
రాధే శ్యామ్‌లో ప్రభాస్ ఒక అస్ట్రాలజర్.. పూజా హెగ్డే డాక్టర్. అయితే ఒక అస్ట్రాలజర్, ఒక డాక్టర్‌తో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. అందమైన 'రాధే శ్యామ్'లాంటి కావ్యం అవుతుంది. అది చూపించడానికే మార్చి 11న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్‌లో మరోసారి పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్ చివరిలో ప్రభాస్‌ను 'ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు?' అని పూజా అడిగిన ప్రశ్న ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com