Radhe Shyam Trailer: 'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసిందిగా..

Radhe Shyam Trailer: ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమాపై మూవీ లవర్స్ అందరి దృష్టి ఉంది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సాధించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం అందరి ఫేవరెట్ అయిపోయాడు. పైగా తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్‌కే సిద్ధమవుతున్నాయి. అందులో అన్నింటికంటే ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేది 'రాధే శ్యామ్'. తాజాగా ఈ సినిమా నుండి ప్రభాస్ ఫ్యాన్స్‌ను సంతోషపెట్టే ఓ అప్డేట్ బయటికొచ్చింది.
ఈమధ్య సినిమాల అప్డేట్స్ కాస్త లేట్ అయితే అభిమానుంతా.. నిర్మాణ సంస్థలను, ప్రొడక్షన్ హౌస్‌లనే ప్రశ్నిస్తున్నారు. అలాగే రాధే శ్యామ్ అప్డేట్స్ లేట్ అయిన ప్రతీసారి యూవీ ఆర్ట్స్‌ను తిట్టడం మొదలుపెట్టారు అభిమానులు. అయితే మార్చి 11న రాధే శ్యామ్ విడుదల ఉండడంతో ప్రేక్షకులు అడగకుండానే అప్డేట్స్‌ను ఇచ్చేస్తోంది యూవీ ఆర్ట్స్.
సంక్రాంతికే రాధే శ్యామ్ విడుదల ఖరారు కావడంతో మూవీ టీమ్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. అప్పుడే ట్రైలర్ కూడా లాంచ్ అయ్యింది. అయితే సినిమా సంక్రాంతికి విడుదల కాకుండా వాయిదా పడింది. అందుకే రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్‌ను మార్చి 2న విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. మార్చి 2 మధ్యాహ్నం 3 గంటలకు రాధే శ్యామ్ ట్రైలర్ ప్రేక్షకులకు పలకరించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com