Radhika Apte : పూరీ సినిమాలో రాధికా ఆప్టే

Radhika Apte  : పూరీ సినిమాలో రాధికా ఆప్టే
X

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న దర్శకుడు పూరీ జగ న్నాథ్. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. తమిళ హీరోతో పూరీ చేస్తున్న మొదటి సినిమా కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ ఉంది. ఇందులో రాధికా ఆప్టే నటించనుందనే టాక్ ఉంది. వాటిపై తాజాగా ఆమె స్పందించింది. ప్రస్తుతానికి తన వద్ద ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు చెబుతోంది. పూరీ, సేతుపతి సినిమాపై తాను కూడా విన్నానని.. కానీ ఇప్పటి వరకు వారు తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపింది. ఏదైనా అప్డేట్ ఉంటే చెబుతానంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మూవీని విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటి కే మూవీ టీమ్ ప్రకటించింది. ఇంతకు ఈ సినిమాలో రాధిక నటిస్తుందా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.

Tags

Next Story