Chiranjeevi New Movie : రఫ్ఫాడిస్తాం! చిరు - అనిల్ మూవీ టీమ్ ఇదే!

Chiranjeevi New Movie : రఫ్ఫాడిస్తాం! చిరు - అనిల్ మూవీ టీమ్ ఇదే!
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ చిత్రానికి ఉగాది రోజున శ్రీకారం చుట్టారు. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇందులో చిరంజీవి హుషారైన పాత్రని చేయనున్నారు. వినోదాత్మక కథనంతో రూపొందే చిత్రమిది. సోషల్ మీడియా ద్వారా తన సినిమాలను ప్రమోట్ చేసే అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవి సినిమాకు సైతం ప్రమోషన్స్ ప్రారం భించేశారు. ఇందులో భాగంగా చిరంజీవి పోషించిన ఐకానిక్ పాత్రలతో ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అజ్ఞు మహాకాళి, తిరుమల నా ఉపేంద్ర రచయితలు తాము డైమండ్స్ లా పనిచేస్తామన్నారు. అనిల్ రావిపూడి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను లా హిట్లర్ ప్రశ్నిస్తానని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రచయిత ఎస్ కృష్ణ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని తెలిపారు. డిఓపీ సమీర్ రెడ్డి తాను జెట్ స్పీడ్లో షూట్ చేస్తానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాస్టర్ పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి స్వయంగా గోదారి గట్టు పాట నుండి కొన్ని చరణాలు ఆలపించడం సర్ ప్రైజ్. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రేక్షకులకు బ్లాక్బస్టర్ ఫెస్టివల్ అందిస్తామని హామీ ఇచ్చారు. చివరగా అనిల్ రావిపూడి తాను గ్యాంగ్ లీడర్ వ్యవహరిస్తానని చెబుతూ రఫ్పాడిద్దాం అంటూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది.

Tags

Next Story