Raja Saab OTT : అప్పుడే ఓటిటిలోకి రాజా సాబ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాజా సాబ్. ఈ మూవీకి అంచనాలను అందుకోలేకపోయింది. బిగ్ ఫ్లాప్ గా తేలిపోయింది. సంక్రాంతి పండగ స్పెషల్ గా విడుదలైనా కూడా ఆడియన్స్ నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం మాత్రం బిగ్ మైనస్ అయింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏ దశలో కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆ కారణంగా వసూళ్లు కూడా దారుణంగా పడిపోయాయి. టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ అతనికి చాలా పెద్ద డిజప్పాయింట్ మెంట్ అయింది. ప్రభాస్ ను చూపించే విధానం కొత్తగా ఉంది అనుకున్నారు తప్ప ఆ కొత్తదనం మాత్రమే మైనస్ అయింది. ఇక ఈ మూవీ ఓటిటికి రెడీ అవుతోంది.
ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. జరీనా వాహబ్ కీలక పాత్రలో విలన్ గా సంజయ్ దత్ గా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 13నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓ రకంగా సంక్రాంతి బరిలో విడుదలైన అన్ని మూవీస్ కంటే కూడా చాలా ముందుగా రాజా సాబ్ ఓటిటిలో విడుదల కాబోతోంది. మరి ఓటిటి నుంచి ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
