Tollywood : జక్కన్న, మహేశ్ .. వెయ్యికోట్ల సినిమా

జక్కన్న, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై ఇటీవల దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ చేసిన కామెంటులు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చన్నారు. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారని చెప్పారు. వెయ్యికోట్ల బిజినెస్ రాబట్టే అవకాశం ఉందని అన్నారు. రెండు వేల కోట్లు వసూలు చేయొచ్చంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు మూడు,నాలుగు వేల కోట్లు రాబట్టే అవకాశమూ లేక పోలేదంటున్నారు. తెలుగు సినిమాలోనే కాదు.. భారతదేశ సినీరంగంలోనే ఈ చిత్రం చరిత్ర అవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కథ గురించి జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తాను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులమని చెప్పారు. ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజమౌళి - మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com