Tollywood : శరవేగంగా రాజమౌళి - మహేశ్ సినిమా షూటింగ్

మహేశ్ బాబు, రాజమౌళి తొలి కాంబినేషన్ సినిమా గురించి మరిన్ని ఊహాగానాలు బయటకొచ్చాయి. సినిమా కథ, షూటింగ్ పై దర్శకుడు ఇప్పటికీ స్పష్టంగా ఏదీ చెప్పనప్పటికీ సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తోంది. సినిమా నిర్మాణం కోసం సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విషయం ఏమంటే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేశారు. హైదరాబాద్లో భారీ ఖర్చుతో వారణాసి సెట్ వేస్తున్నారు. కెన్యా అడవుల్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయనున్నారని తెలిసింది. ఇందుకోసం త్వరలో చిత్ర బృందం కెన్యా వెళ్ళనుందని తెలిసింది. ట్రెడర్ హంట్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని, మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా, మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా.కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com