Rajamouli : RRR సినిమా కన్నా డాక్యుమెంటరీనే ఎమోషనల్: రాజమౌళి

తాను దర్శకత్వం వహించిన RRR సినిమా కన్నా ఇటీవల వచ్చిన డాక్యుమెంటరీనే ఎమోషనల్‌గా ఉందని రాజమౌళి ట్వీట్ చేశారు. 20TB డేటా నుంచి సరైన మెటెరియల్‌ను తీసిన వాల్ అండ్ ట్రెండ్స్ టీమ్ వర్క్‌ను ప్రశంసించారు. ఎడిటర్ శిరీష, వంశీ పనితీరును మెచ్చుకున్నారు. ఈ టీమ్ వర్క్ పట్ల గర్వంగా ఉందని, ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. RRR సినిమా షూటింగ్ సీన్స్‌తో రూపొందించిన బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీలోకి వచ్చేసింది.
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు వ్యాప్తి చేసిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ . రామ్‌చరణ్ , ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ (నాటు నాటు పాటకు) అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా చిత్రీకరణ విశేషాలను తెలియజేస్తూ ఇటీవల చిత్రబృందం ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీ సిద్ధం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com