Coolie Movie : OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?

Coolie Movie : OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?
X

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.507 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో రూ.281 కోట్ల నెట్ వసూలు చేసింది. రాష్ట్రాల వారీగా వసూళ్లు చూస్తే.. సొంత భాష తమిళంలోనే అత్యధికంగా రూ.180 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో రూ.60 కోట్లు చేయగా, హిందీలో రూ.36 కోట్లు, కన్నడలో రూ.2.92 కోట్ల వసూళ్ళు సాధించింది.

Tags

Next Story