Rajkummar Rao : గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్

Rajkummar Rao : గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్
X

తన బయోపిక్‌లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తారని మాజీ క్రికెటర్ గంగూలీ వెల్లడించారు. అయితే డేట్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావడానికి ఏడాది టైమ్ పడుతుందని చెప్పారు. గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు చేశారు. 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.

కాగా గతేడాది స్త్రీ 2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు రాజ్ కుమార్ రావు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తం 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అంతకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో రాజ్ కుమార్ రావు అద్భుతంగా నటించాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టులో దాదాగా పేరొందిన సౌరవ్ గంగూలీ బయోపిక్‌లోనూ రాజ్ కుమార్ రావును ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.

Tags

Next Story