Rakul Preet Singh : ప్రభాస్ సినిమా నుంచి అర్థాంతరంగా తొలగించారు : రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh : ప్రభాస్ సినిమా నుంచి అర్థాంతరంగా తొలగించారు : రకుల్ ప్రీత్ సింగ్

ప్రభాస్ సినిమా నుంచి తనను అర్థాంతరంగా తొలగించారని.. గతంలో తనకు జరిగిన ఛేదు అనుభం గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ చెప్పారు. తెలుగులో రెబల్ స్టార్‌ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని.. కానీ ఊహించని విధంగా తనకు చెప్పకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ... "నాకు ప్రభాస్‌తో మొదటిసారి నటించే అవకాశమొచ్చింది..నా షెడ్యూల్‌ను ముగించిన తర్వాత ఢిల్లీకి వెళ్లాను.. ఆ తర్వాతే సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. నాలుగు రోజుల పాటు షూటింగ్‌ అయ్యాక చెప్పకుండానే మరొకరితో రీప్లేస్ చేశారు. ఈ విషయంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు" అని రకుల్ చెప్పుకొచ్చింది

Tags

Next Story