Rakul Preet Singh : ఎల్లే కవర్ పేజీపై రకుల్ .. ఫోటోలకు ఫోజులు..
![Rakul Preet Singh : ఎల్లే కవర్ పేజీపై రకుల్ .. ఫోటోలకు ఫోజులు.. Rakul Preet Singh : ఎల్లే కవర్ పేజీపై రకుల్ .. ఫోటోలకు ఫోజులు..](https://www.tv5news.in/h-upload/2024/02/17/1191555-rakul-preet-singh.webp)
కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ (Rakul Preet Singh). అనంతరం టాప్ హీరోలతో నటించిన ఈ అమ్మడు చాలా హిట్లు అందుకుంది. అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో రకుల్ నటించింది. హిందీలో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను ఈమె యాక్ట్ చేసింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా త్వరలోనే రకుల్ ప్రీతి సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె వివాహం చేసుకోనుంది. గోవా వేదికగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. దాదాపు మూడు రోజుల పాటు వైభవంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
బాలీవుడ్ (Bollywood) పరిశ్రమకు చెందిన డిజైనర్లు సబ్యసాచి, తరుణ్ తహి ల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులను డిజైన్ చేశారని తెలిసింది. అయితే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రకుల్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రీసెంట్ గా ప్రముఖ మేగజైన్ ఎల్లే కవర్ పేజ్ పై ఈ బ్యూటీ మెరిసింది. చూపు తిప్పుకోలేని అందంతో ఆ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలకు నెజిజెన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com