Ram Charan : హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది. దీనికి ముందు, తర్వాత వేరే ఏ ప్రాజెక్ట్ కూ కమిట్ కాలేదు రామ్ చరణ్. అందుకే పెద్ది పై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు. నాన్ స్టాప్ గా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాగా రూపొందుతోంది పెద్ది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడని ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థం అయింది. ఆ గ్లింప్స్ ఐపిఎల్ టైమ్ లో రావడంతో మరింత వైరల్ అయింది.
ఇక ప్రస్తుతం ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ లో ట్రెయిన్ పై జరిగే ఫైట్ సీన్ అట ఇది. సినిమాకే హైలెట్ గా నిలిచే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఫైట్ మాస్టర్ నవకాంత్ కంపోజ్ చేస్తున్నాడు.పుష్ప 2 కోసం నవకాంత్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం పెద్దితో పాటు ప్రభాస్ 'ఫౌజీ'చిత్రానికి కూడా అతనే యాక్షన్ కొరియోగ్రాఫర్. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ గురించి యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆ సందర్భంగా కనిపించిన రామ్ చరణ్ లుక్ సైతం అదిరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ ఫైట్ సీన్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com