Ram Charan : రామ్ చరణ్ హుడీ రూ. 88 వేలు

Ram Charan : రామ్ చరణ్ హుడీ రూ. 88 వేలు
X

బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టాపబుల్ షోలో మెగా హీరో రాంచరణ్ తేజ్ సందడి చేశాడు. ఈ 'ఆహా' వేదికపై నుంచి సంక్రాంతికి రిలీజవుతున్న తన సినిమా 'గేమ్ ఛేంజర్'ను ప్రమోట్ చేశాడు. ఈ షోలో అందరి దృష్టినీ ఆకర్షించిన మరో విషయం ఏమిటంటే.. చరణ్ తొడుక్కున్న బ్లాక్ హుడీ. పొడవాటి జుట్టు.. గుబురు గడ్డం.. స్మైలీ ఫేస్ తో చరణ్ ఈ షోలో కనిపించాడు. ఆ రూపానికి తగినట్టుగానే బ్లాక్ హుడీ, బ్లాక్ ఫ్యాంట్ లో చరణ్ స్మార్ట్ గా కనిపించాడు. ముఖ్యంగా చరణ్ ధరించిన డిజైనర్ హుడీ అందరి దృష్టిని ఆకర్షించింది. హుడీ ఎంతో స్టైలిష్ గా లావిష్ గా పర్సనాలిటీని ఎలివేట్ చేసే విధంగా ఉంది. లుక్ కి తగ్గట్టే హుడీ ధర కూడా నోరెళ్లబెట్టే రేంజులోనే ఉంది. దీని ఆన్ లైన్ ధర సుమారు రూ.88,000 నుంచి 1,50,000 వేల రేంజులో ఉంటుంది. ఎఎంఐఆర్ఐ బోన్స్ కంపెనీ ప్రాడక్ట్

Tags

Next Story