Ram Charan : మహారాష్ట్ర సీఎంతో రామ్ చరణ్ దంపతులు భేటీ

ఆస్కార్ అవార్డు గ్రహీత చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' నటుడు రామ్ చరణ్ డిసెంబర్ 22న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఒక ఫొటోను షేర్ చేసిన రామ్ చరణ్, “గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారూ, మహారాష్ట్రలోని వైబ్రెంట్ ప్రజలారా, మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము”అని రాసుకొచ్చారు. ఈ చిత్రంలో చరణ్ సీఎంతో శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు కనిపించారు. అంతే కాదు ఈ సమయంలో రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కొణిదెల కూడా వెంట ఉన్నారు.
ఈ భేటీకి రామ్ చరణ్ బ్లాక్ ప్యాంట్‌తో జత చేసిన బ్లూ డెనిమ్ షర్ట్ ధరించి.. బ్లాక్ స్పెక్స్‌తో తన రూపాన్ని పూర్తి చేశాడు. ఇక అతను ఈ చిత్రాన్ని పంచుకున్న వెంటనే, అతని అభిమానులు కామెంట్ల సెక్షన్ లో తమ అభిప్రాయలను తెలపడం ప్రారంభించారు. రెడ్, లవ్, ఫైర్ ఎమోజీలను వదులుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు కొందరు.
ఇదిలా ఉండగా, వర్క్ ఫ్రంట్‌లో, చరణ్ తదుపరి దర్శకుడు శంకర్ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గేమ్ ఛేంజర్'లో కియారా అద్వానీ సరసన నటించనున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుత రాజకీయాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇది తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ఇక దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ చిత్రం పాన్ ఇండియాలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com