Kill Director : కిల్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

Kill Director : కిల్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?
X

బాలీవుడ్‌లో గత ఏడాది ‘కిల్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్. ఆయన తన తర్వాతి సినిమాను రామ్‌చరణ్‌తో చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒక వేళ ఇదే నిజ‌మైతే మెగా ఫ్యాన్స్‌కి పండ‌గ‌నే చెప్పుకోవ‌చ్చు. కాగా ఈ ప్రాజెక్ట్‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రావాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ యాక్షన్ డ్రామా కథ అని సమాచారం. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా వర్క్ వేగంగానే జరుగుతుంది. ఈ సినిమా తర్వాత RC17 సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. దీని తర్వాత పలువురు పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏ ప్రాజెక్టు ఓకే చేయలేదు.

Tags

Next Story