Ram Charan : రామ్ చరణ్ ఆస్తి ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే

చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ కొట్టి స్టామినా చూపించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అయితే భారీ ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన
గేమ్ ఛేంజర్ సినిమా అభిమానులను నిరాశ పరిచింది. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ కెరీర్లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్ నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పెద్ది (Peddi) అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం.
టైటిల్ పోస్టర్ లో రామ్ చరణ్ ఊర మాస్ యాంగిల్లో కనిపించాడు.బీడీ కాల్చుతూ దర్శనం ఇచ్చాడు. రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆస్తులు కూడా గట్టిగానే వెనుక వేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. రామ్ చరణ్ ఒక్కో ప్రకటనకు 2 నుండి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి రామ్ చరణ్ నిర్మాతగా మారారు. రామ్ చరణ్ ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థను కలిగి ఉన్నారు. రామ్ చరణ్ దగ్గర మెర్సిడెస్ మేబాచ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రామ్ చరణ్ కి ఒక పెద్ద బంగ్లా ఉంది. దీని విలువ 40 నుండి 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ 1370 కోట్ల పైనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com