Tollywood : మైసూర్ లో రాంచరణ్ ఆర్సీ 16 షూటింగ్

Tollywood : మైసూర్ లో రాంచరణ్ ఆర్సీ 16 షూటింగ్
X

రాంచరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్సీ 16. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పంచుకున్నారు. ఈ సినిమాలో తాను భాగమైనట్లు తెలిపారు. 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దీని షూటింగ్ మైసూర్లో జరుగుతున్నట్లు తెలిపారు. రాత్రి వేళ కూడా షూటింగ్ అసాగుతోంది. మంచి టీమ్తో కలిసి వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నా రు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రత్నవేలు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లు చెప్పడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం డైరెక్టర్ బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్చరణ్ పాత్ర పవర్ఫుల్గ ఉండనుంది. కన్నడ నటుడు శివరాజ్కు మార్, జగప తిబాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నా రు. ఈ చిత్రానికి 'పెద్ద' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ మొదల య్యాయని.. రెండు పాటలు కూడా పూర్తి చేశానని ఇటీవల రెహమాన్ వెల్లడిం చిన సంగతి తెలిసిందే.

Tags

Next Story