Ram Gopal Varma : పోలీసుల వెతుకులాటపై సెటైర్లతో రామ్ గోపాల్ వర్మ ప్రహారం

Ram Gopal Varma : పోలీసుల వెతుకులాటపై సెటైర్లతో రామ్ గోపాల్ వర్మ ప్రహారం
X

పోలీసుల వెతుకులాట వార్తలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన వర్మ.. పోలీసులు తన డెన్ కు ఎప్పుడూ రాలేదన్నారు. మెయిన్ మీడియా సోషల్ మీడియా కంటే భయంకరంగా మారిందని విమర్శించారు. తనపై పోలీసులను ఉసిగొల్పేలా వార్తలు వేశాయన్నారు. ఇప్పటి వరకు తాను వేల ట్వీట్లు చేశానని..సంవత్సరం కింద ట్వీట్ పెడితే ఇప్పుడు కేసు పెడుతారా అని ప్రశ్నించారు దర్శకుడు ఆర్జీవీ. తాను ట్వీట్‌ చేసిన రోజు వాళ్లు ఎం చేశారని విమర్శించారు. ఎప్పుడు ఏ ట్వీట్‌ పెట్టానో తనకే తెలియదన్నారు. అబద్దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆర్జీవీ.

Tags

Next Story