Ram Gopal Varma : మంత్రి పేర్ని నానితో భేటి కానున్న వర్మ

Ram Gopal Varma : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడేందుకు రామ్ గోపాల్ వర్మ... మంత్రి పేర్నినానితో భేటీ కానున్నారు. ఈ నెల 10 వ తేదీన మధ్యాహ్నం సమావేశానికి రావాలని... మంత్రి నుంచి ఆహ్వానం అందినట్లు వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. సినీరంగ సమస్యలపై అభిప్రాయాలను పంచుకునేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి పేర్నినాని కూడా సమాధానమివ్వడం.. ఆ తర్వాత మళ్లీ వర్మ కౌంటర్ ఇవ్వడంతో... వ్యవహారం రసవత్తరంగా మారింది. చివరికి మంత్రి పేర్ని నాని రామూను చర్చలకు పిలవడంతో... ఈ ట్వీట్ల యుద్ధానికి తెరపడింది. ఇక ఇప్పుడు ముందుగా చెప్పినట్లుగానే... మంత్రి వర్మను సమావేశానికి ఆహ్వానించారు.
Happy to inform that I have been invited by the honourable cinematography minister to the Amaravati Secretariat on January 10 th afternoon ….Thank u @perni_nani Garu for your kind initiative to exchange views on the AP ticket pricing for an amicable solution💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com