Ram Pothineni : సాగర్.. మీకు సుపరిచితమే

X
By - Manikanta |6 Dec 2024 9:00 PM IST
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. సరికొత్త కథా కథనాలతో వస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. ఈనేపధ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి హీరో రామ్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. సాగర్" అంటూ లాంగ్ హెయిర్ పాత సైకిల్ తో ఉన్న రామ్ పోస్టర్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా కాలంగా హిట్స్ లేక సతమవుతున్న రామ్ కి ఇది ఏ రేంజ్ సక్సెస్ ను ఇస్తుంది అనేది చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com