Bollywood : రామాయణ షూటింగ్ కంప్లీట్

Bollywood : రామాయణ షూటింగ్ కంప్లీట్
X

బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా రామాయణ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా మూడు భాగాలుగా తెరపైకి రానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా హీరో రన్బీర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. అదేంటంటే.. ఈ సినిమా పార్ట్ 1 కి సంబందించిన షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రన్బీర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story