Double iSmart Deal : రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్
రామ్ పోతినేని- హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేండ్ల కిందట వీరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన రెండు మాస్ సాంగ్స్ ఆడియెన్స్ ను అలరించాయి. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న మణిశర్మ మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఈ రెండు సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.33 కోట్లకు డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రైట్స్ ను రూ.60 కోట్లకు ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ కు చెందిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దక్కించుకున్నారు. రామ్ కెరీర్ లోనే ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇదే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ లో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నెగెటివ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com