Bollywood Star Couple : వంద కోట్ల ఇంట్లో రణ్ వీర్, దీపికా కాపురం

Bollywood Star Couple : వంద కోట్ల ఇంట్లో రణ్ వీర్, దీపికా కాపురం
X

బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకునె తమ కోసం ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, సముద్రానికి ఎదురుగా ఉండే విధంగా నివాసం ఏర్పాటుచేసుకున్నారు. ఇందుకోసం రూ. వంద కోట్లు ఖర్చు చేశారని బాలీవుడ్ సమాచారం. విలాసవంతమైన అపార్టుమెంట్లలో మూడు అంతస్తుల్లో వీరి ప్లాట్ ఉంటుందని తెలిసింది. ఇంటికోసం ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం అరుదుగా జరుగుతుంది.

పెద్ద పెద్ద భవంతుల్లోనే పలువురు తారలు నివసిస్తున్నారు. క్రికెటర్లు, సినీ నటులు ఈ తరహా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. వారి లగ్జరీ జీవితానికి సరిపడే విధంగా ఈ తరహా నివాసాలు కావాలని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అమితాబ్ వంచి స్టార్స్ ఇప్పటికే కళ్లుచెదిరే భవనాలు నిర్మించుకున్నారు.

Tags

Next Story