Rashi Singh : వర్షపు చినుకుల్లో రాశి సింగ్.. ఈ ఫొటోలు చూశారా!

రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పా ల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. 14 ఏళ్ల వయసు లోనే ఓ కమర్షియల్ యాడ్ లో నటించిన ఈ భామ.. మొదట ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ నటన మీద ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ‘'జెమ్' సినిమాతో తెలుగు తెరకు పరిచమైయన ఈ బ్యూటీ ఆది సాయికుమార్ తో 'శశి' చిత్రంతో గుర్తింపు పొందింది. పోస్టర్, ప్రేమ్ కుమార్ వంటి చిత్రాల్లో అలరించింది. ఈ మధ్య కాలంలో 'భూతద్దం భాస్కర్ నారాయణ'లోనూ మెప్పించింది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా 'ప్రసన్నవద నం, బ్లైండ్ స్పాట్ 'తో ఆడియన్స్ ను పలకరించింది రాశి సింగ్. అయితే మూవీల్లో అంతగా అవకాశాలు రాకపోయినా ఫ్యాన్స్ తో మాత్రం టచ్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి.. ఎప్ప టికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్ లతో ఆకర్షిస్తుంది. చీరలు, మోడరన్ డ్రెస్సుల్లో ఆమె ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా వర్షంలో నల్లటి కారు హుడ్ పై కూర్చుని కనిపించింది. ఆధునిక శైలిలో రూపొందించిన బూడిద, బంగారు రంగు చీరలో యూత్ని తెగ ఆకట్టుకుంటుంది. ఆమె అందం, నటనా నైపుణ్యంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు కోసం ప్రయ త్నిస్తోంది, అయితే ఇంకా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com