Rashii Singh : వర్షంలో రాశీ సింగ్ కవ్వింపులు.. ఫోటోలు వైరల్

Rashii Singh : వర్షంలో రాశీ సింగ్ కవ్వింపులు.. ఫోటోలు వైరల్
X

రాశీ సింగ్.. గురించి ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. మొదట్లో ఓ యాడ్ లో నటించి ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ గా ఆన్డ్యూటీలో హైదరాబాద్ వచ్చిన నిషా కళ్ల రాశీ.. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది. 'జెమ్' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ ఆది సాయికుమార్ తో 'శశి' చిత్రంతో గుర్తింపు పొందింది. 'పోస్టర్', 'భూతద్దం భాస్కర్ నా రాయణ'లోనూ మెప్పించింది. రీసెంట్ గా 'ప్రసన్నవదనం, బ్లైండ్ స్పాట్ తో ఆడియన్స్ ను పలకరించింది. తెలుగులో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న రాశీ సింగ్ టాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్లతో కుర్రకారును ఆకర్షిస్తుంది. తాజాగా తన ఇన్స్టాలో వైట్ శారీలో తడి అందాలతో పిచ్చెక్కిస్తున్న ఫొటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story