Tollywood : ఎన్టీఆర్ సరసన రష్మిక?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా డ్రాగన్ . భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఎప్పుడో అనౌన్స్ అవ్వగా ఇప్పుడు ఫైనల్ గా పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ సెట్స్లోకి జాయిన్ అయ్యాడు. ఈ మూవీ కోసం ఆయన తన లుక్ పూర్తిగా మార్చేశాడు. గుర్తుపట్టలేనంతగా బక్క చిక్కి స్లిమ్ లుక్లోకి మారిపోయాడు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసుకున్నాడని సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ గ్రాండ్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఆ సాంగ్ లో రష్మిక మందాన్నా కనిపించబోతోందని, ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెను అప్రోచ్ అయ్యాడని, రష్మిక కూడా సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం రష్మిక కెరీర్ కూడా ఫుల్ ఫామ్లో ఉంది. చేతిలో ఈ అమ్మడుకి అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. మరి తారక్ తో రష్మిక నిజంగానే ఆడిపాడనుందా తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com