Ravi Teja Daughter : రవితేజ కూతురు ఎంట్రీ.. ఎంట్రీకి లైన్‌ క్లియర్‌

Ravi Teja Daughter : రవితేజ కూతురు ఎంట్రీ.. ఎంట్రీకి లైన్‌ క్లియర్‌
X

సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఈ మాస్ మహారాజ్ కు ఒక కొడుకు, ఒక కూతురు... కాగా కొడుకు మహాధన్ ఇప్పటికే రాజా గ్రేట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నట్లు సమాచారం. ఇక రవితేజ కూతురు మోక్షద విషయానికొస్తే... ఆమె నిర్మాణ బాధ్యతలు నేర్చుకుంటుందోని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. సితార ఎంటర్ టైన్మెంట్స్... వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ఒక సినిమాకు ప్లాన్ చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ ప్రాజెక్టు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ సినిమా ద్వారా మోక్షద హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తోందట. . ఆపై బాలకృష్ణ- బోయపాటి శ్రీను కొత్త సినిమా BB4కు నందమూరి తేజస్విని నిర్మాతగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరందరి సరసన రవితేజ ముద్దులు కూతురు మోక్షిద కూడా చేరనుంది.

Tags

Next Story