Mass Jathara : నిరాశలో రవితేజ ఫ్యాన్స్.. మాస్ జాతర విడుదల వాయిదా..

గత కొన్ని రోజుల క్రితం జరిగిన సినీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ మాస్ మహారాజా రవితేజ సినిమాపై పడింది. రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "మాస్ జాతర" ను ఈ నెల 27 న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే సమ్మెతో పాటు పలు కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఎక్స్ వేదికగా సినిమా విడుదల వాయిదాను ప్రకటించారు యూనిట్ సభ్యులు. "పరిశ్రమలో జరుగుతున్న సమ్మెలు, మరికొన్ని ఊహించని కారణాల వల్ల సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదు. అందుకే 'మాస్ జాతర' విడుదలను వాయిదా వేస్తున్నాం" సినిమా ఆలస్యమైనప్పటికీ, ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేసారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా...ఇప్పటికే విడుదల అయిన పాటలు సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. అంతే కాకుండా రవితేజకి ఇది 75 వ సినిమా కావడంతో ఆయన ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ఒక రైల్వే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com