RC 16 : ఆర్సీ 16 ... నిఖార్సైన మాస్ లుక్

RC 16 : ఆర్సీ 16 ... నిఖార్సైన మాస్ లుక్
X

గ్లోబల్ స్టార్ రాంచరణ్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. ఆర్సీ 16 పేరుతో సెట్స్ పై ఉన్న సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసింది మూవీ యూనిట్. బుచ్చిబాబు దర్శకత్వంలో రాంచరణ్ తేజ్, జాన్వీకపూర్ జంటగా ఈ సినిమాలో ననటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిజానికి ఇవాళ టీజర్ ప్లాన్ చేశారు. కానీ ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఉగాది రోజు దాన్ని విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కి టైటిల్ రివీల్ పోస్టర్ రూపంలో మంచి కానుక అందించింది టీం. ముందు నుంచి ప్రచారం జరిగినట్టే పెద్ది టైటిల్ అధికారికంగా లాకైపోయింది. నిఖార్సైన మాస్ లుక్ తో చేతిలో చుట్ట కాలుస్తూ రౌద్రం నిండిన కళ్ళతో రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే రంగస్థలం సినిమాను మించి ఉంది. రెండో స్టిల్ లో జీన్స్ ప్యాంటు లో రఫ్ లుక్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా విడుదల తేదీని ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. టీజర్ లో ఉంటుందని సమాచారం. 2026 మార్చి 26 ఖరారయ్యిందనే లీక్ వచ్చింది. దానిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శివకుమార్, జగపతి బాబు, దివ్యేన్దు లాంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Tags

Next Story