RC16 Update : వచ్చే నెలలో సైట్స్ పైకి RC16

రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ) బుచ్చిబాబు సాన కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. అలనాటి అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరైతే పెట్టలేదు. ప్రస్తుతానికి దీనిని ఆర్సీ 16గా పిలుస్తున్నారు. మొన్నటి వరకు రాంచరణ్ గేమ్ చేంజర్ మూవీపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు రాంచరణ్ తన పదహారో సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ప్రచారం జరుగుతోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా అని కూడా అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యనే ఏఆర్ రెహమాన్ బుచ్చి బాబుతో కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే మూడు సాంగ్స్ ఫైనల్ చేశారట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఆ మూడు పాటలు బుచ్చిబాబుతో సహా టీంకి బాగా నచ్చాయని తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి సెట్స్ మీదకు సినిమాని తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com