Dhanush : బయట కనిపించే దానికి రియాలిటీకీ చాలా తేడా ఉంటుంది: ధనుష్

ఇటీవల కుబేర మూవీతో హిట్ సొంతం చేసుకున్నాడు ధనుష్. ఇప్పుడు ఆయన స్వీయ దర్శకత్వంలో రానున్న సినిమా ఇడ్లీకొట్టు. అక్టోబరు 1న ఈ మూవీ ప్రేక్ష కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్లో ట్రోల్స్ చేసే వారి గురించి మాట్లాడాడు. అసలు హేటర్స్ అనే కాన్సెప్టే లేదన్నాడు. అందరూ హీరోలందరి సినిమాలు చూస్తారని చెప్పాడు. ఓ 30 మంది ఒక బృందంగా ఏర్పడి 300 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని.. వారి మనుగడ కోసం కావాలనే కొందరు హీరోలపై ద్వేషం వ్యక్తం చేస్తారని తెలిపాడు. కానీ ఆ 30 మంది కూడా చూస్తారన్న ధనుష్.. బయట కనిపించే దానికి రియాలిటీకీ చాలా తేడా ఉంటుందన్నాడు. ఈ మూవీలో ధనుష్ సరసన నిత్యామేనన్ నటించింది. తిరు సక్సెస్ తర్వాత వీరి కలయిక తో రాబోతున్న చిత్రమిది. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో రూపొందిన. ఈ మూవీలో ప్రకాశ్జ్, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com