Rebel Star Prabhas : షూట్ మోడ్ లో రెబల్ స్టార్

Rebel Star Prabhas :  షూట్ మోడ్ లో రెబల్ స్టార్
X

రెబల్ స్టార్ ప్రభాస్ షూట్ మోడ్ లోకి రాబోతున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. వీటిలో రాజా సాబ్ టీజర్ ఈ నెలలోనే రాబోతోంది. సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తాం అని ప్రకటించారు. తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే కథతో రాబోతున్నాడు. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతోన్న ఈ మూవీ షూటింగ్ లోనే ప్రభాస్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు. సమ్మర్ అంతా యూరప్ హాలిడేలో ఉన్న డార్లింగ్ స్టార్ ఈ నెలలోనే హైదరాబాద్ కు వచ్చాడు. ఆయన రావడానికి ముందే ఫౌజీ(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టాడు హను రాఘవపూడి.

ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని చెబుతూ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ ఓ ఫోటో తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోతో పాటు మై సోల్జర్స్ ఆర్ రెడీ అంటూ ఇంగ్లీష్ లో ఓ కొటేషన్ పెట్టాడు. ఫోటోలో ఉన్నవి చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. చూడగానే తుపాకుల్లా కనిపించాయి. కానీ అవి తుపాకులు కాదు. యుద్ధ రంగంలో వాడే ఓ రకమైన ఆయుధాల్లా ఉన్నాయి. లేదా ఆయుధాలకు సపోర్ట్ చేసే వస్తువులు కావొచ్చు. మొత్తంగా ఈ వారం నుంచే ప్రభాస్ ఫౌజీ లొకేషన్ లో జాయిన్ కాబోతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

Tags

Next Story