Balakrishna : తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం నా అదృష్టం

గద్దర్ సినీ పురస్కారాల్లో భాగంగా తనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడంపై నందమూరి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంతో ప్రత్యేకమైన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి తాను ఎంపికకావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. "ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, నటుడిగా నేను యాభై ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం. కేంద్రప్రభుత్వం ఇటీవలే పద్మభూషణో సత్కరించిన ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డు. ప్రకటించడం నా అదృష్టం. దీనిని దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ పురస్కారానికి ఎంపికచేసిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు" అని తెలిపారు బాలయ్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com