Tollywood : కోలీవుడ్లో రకుల్ సినిమాలు చేయడానికి రెజీనానే కారణమట

హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా బెస్ట్ ఫ్రెండ్స్. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య క్లోజ్ ఫ్రెండ్స్ కాంబినేషన్ పెద్దగా కనిపించదు. వారంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇండస్ట్రీకి దిగుమతి కావడమే ఇందుకు కారణం. వీరిద్దరు కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారే. రకుల్ పుట్టి పెరిగింది ఢీల్లీలో కాగా.. రెజీనా చెన్నైకి చెందిన అమ్మాయి. కానీ వీరిద్దరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే క్లోజ్ అయ్యారు. విదేశాలకు వెకేషన్లకు కలిసి వెళ్లడం.. అక్కడ ఇద్దరు ఒకే రూమ్ లో దిగడం.. కలిసి విదేశీ అందాలు ఆస్వాదించడం.. అలా బెస్ట్ ఫ్రెండ్స్ మారిపోయారు. అంతే కాదు.. ఇద్దరూ సినిమా అవ కాశాలు కూడా షేర్ చేసుకుంటారట. కోలీవుడ్లో రకుల్ సినిమాలు చేయడానికి రెజీనానే కారణమట. ఆడిషన్స్కు వెళ్లిన సమయంలో తాను ఫిట్ అవ్వని రోల్కు రకుల్ ఫిట్ అవ్వడం కారణంగా ఇంకొన్ని అవకాశాలు అందుకుందట. ఇక బాలీవుడ్లో రెజీనా అవకాశాలు అందుకోవడానికి రకుల్ కీ రోల్ ప్లే చేసిందట. ప్రస్తుతం రెజీనా బాలీవుడ్లో మూడు సినిమాలు చేస్తోంది. వాటిలో రెండు మూవీస్ రకుల్తో ఫ్రెండిషిప్ కారణంగానే వచ్చాయట. సినిమాల్లో అవకాశాల కోసం పోటీ వాతావరణం నెలకొనే చోట వీరిద్దరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com