Tollywood : కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్

X
By - Manikanta |26 Nov 2024 11:30 AM IST
మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు మేకర్స్. 2025 ఏప్రిల్ 25న పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ న్యూస్ తెలిసిన మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఆవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్నీ సాధిస్తుంది అనేది చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com